

బాలీవుడ్ 2025లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన Dhurandhar సినిమా 2026లోకి అడుగుపెట్టినా తన జోరు తగ్గడం లేదు. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం నాలుగు వారాలు పూర్తైనా రోజువారీ కలెక్షన్లు ఇంకా డబుల్ డిజిట్స్‌లోనే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా, దేశీయ బాక్సాఫీస్‌లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉంది.
ప్రస్తుతం హిందీ మార్కెట్లో అత్యధిక నెట్ కలెక్షన్లతో ముందున్న Pushpa 2 (రూ.830 కోట్లు) రికార్డును ‘ధురంధర్’ త్వరలోనే అధిగమించనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా దేశీయ నెట్ కలెక్షన్లు రూ.820 కోట్ల వద్ద ఉన్నాయి. ఇదే ఊపుతో కొనసాగితే మొత్తం రన్లో రూ.850 కోట్లకు చేరే అవకాశముంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా రూ.1230 కోట్ల గ్రాస్ వసూలు చేసిన RRR రికార్డును కూడా ‘ధురంధర్’ టార్గెట్ చేస్తోంది. అలా జరిగితే, ఈ చిత్రం ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ జాబితాలో టాప్ 4లో స్థానం దక్కించుకోనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!