

అనూహ్యంగా విడుదలైన ‘దీవానా’ ట్రైలర్ తన భావోద్వేగభరితమైన కథనంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. “ఎంత గొప్ప లవ్ స్టోరీ అయినా వన్ సైడ్ లవ్‌తోనే మొదలవుతుంది” అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్, ఒక యువకుడి గాఢమైన ప్రేమ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. అర్హా మీడియా, వి స్టూడియోస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రంలో ప్రేమతో పాటు కుటుంబ అనుబంధాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. నరేష్, ఝాన్సీ, హర్షిత్ రెడ్డి పాత్రలతో కూడిన భావోద్వేగ సన్నివేశాలు ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
హీరోయిన్‌గా నటించిన స్నేహా మనిమేగలై తన సహజ నటనతో ఆకట్టుకుంది. ప్రధాన జంట మధ్య కెమిస్ట్రీ, భావోద్వేగాల తీవ్రత ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. శ్రీకాంత్ సింగిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యకంపూడి నిర్మించగా, గీతా ఆర్ట్స్ పంపిణీ చేస్తోంది. ‘మహర్షి’, ‘ఆర్ఎక్స్ 100’ తరహా కల్ట్ రొమాంటిక్ డ్రామాల ఛాయలను గుర్తుచేస్తూ, జెన్-జీ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో ‘దీవానా’ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!