

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న పాన్ ఇండియా పీరియాడ్ యాక్షన్ మూవీ “డేవిడ్ రెడ్డి” గ్లింప్స్‌ను హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. 1897–1922 మధ్యకాలాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందుతున్న ఈ చిత్రం బ్రిటిష్ కాలం నాటి హింస, ఆవేశం, ప్రతిఘటనల కథను చూపించనుంది. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో, వెంకట్ రెడ్డి–భరత్ మోటుకూరి నిర్మాణంలో వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్‌లో చూపించింది సినిమా స్థాయిలో చిన్న భాగమేనని, అసలు ఇంటెన్సిటీ థియేటర్లోనే కనిపిస్తుందని చిత్రబృందం వెల్లడించింది.
ఈ సందర్భంగా మాట్లాడిన మంచు మనోజ్, “డేవిడ్ రెడ్డి నా అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుంది” అని చెప్పుతూ, ఇది తనకు పర్ఫెక్ట్ కంబ్యాక్ మూవీ అని అన్నారు. శాంతిని నమ్మని, స్వాతంత్ర్యాన్ని అడిగి కాదు కొట్టి తెచ్చుకోవాలనే నమ్మకం ఉన్న శక్తివంతమైన పాత్రగా డేవిడ్ రెడ్డి కనిపిస్తాడని తెలిపారు. బ్రిటిష్‌లతో పాటు అన్యాయాన్ని చేసే భారతీయులపై కూడా పోరాడే యోధుడిగా తన పాత్ర ఉంటుందని చెప్పారు. భారీ బడ్జెట్, స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్, ఇంటెన్స్ యాక్షన్‌తో డేవిడ్ రెడ్డి ప్రేక్షకులకు ఒక పవర్ఫుల్ థియేట్రికల్ అనుభూతిని అందించనుందని టీమ్ ధీమా వ్యక్తం చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!