
గాసిప్స్

థియేటర్లలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సందడి కొనసాగుతున్న సమయంలో, మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. బాబీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా వచ్చే నెలలో అధికారికంగా ప్రారంభం కానుంది. మార్చి నుంచి చిరంజీవి షూటింగ్లో పాల్గొననున్నారని సమాచారం.
ఈ సినిమా కథ కూతురు సెంటిమెంట్‌ను ఆధారంగా చేసుకుని రూపొందించిన యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండనుందని తెలుస్తోంది. ఇందులో మలయాళ అగ్ర హీరో మోహన్‌లాల్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ కథలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. మిగతా నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!