

హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కలయికలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోగి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. 1960ల కాలం నాటి నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన తొలి పాటకు మంచి స్పందన రావడంతో చిత్రబృందం ఇప్పుడు రెండో పాట విడుదలకు సిద్ధమైంది. ఈ పాటను ఈరోజు రాత్రి 8 గంటలకు విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఆవిష్కరించనున్నారు. “హింస అనేది కథలో సగం మాత్రమే.. మిగిలిన సగం ఒక మధురమైన రాగం” అనే వాక్యంతో విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతీ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. ఈ ఏడాది నవంబర్ 12న సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. రెండో పాట విడుదల కార్యక్రమంతో ‘భోగి’పై అంచనాలు మరింత పెరుగుతాయని మేకర్స్ భావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!