

అడివి శేష్ నటించిన డాకోయిట్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన ఆరంభం సాధించింది. యూఎస్ మార్కెట్‌లో హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన శేష్ కెరీర్‌లో ఇది వేగవంతమైన చిత్రం కావడం విశేషం. శనైల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లవ్-యాక్షన్ డ్రామా ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచే మంచి కలెక్షన్లు రాబట్టింది. యూఎస్‌లో ఇప్పటికే $575K పైగా వసూళ్లు నమోదు చేసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 15 కోట్లకు పైగా గ్రాస్ సాధించి శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.
ప్రారంభం నుంచే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడగా, అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన కనిపించింది. తెలుగురాష్ట్రాల్లో మార్నింగ్ షోలతో పోలిస్తే మ్యాటినీ షోలకు రెట్టింపు ఫుట్‌ఫాల్స్ నమోదవ్వడం విశేషం. బుక్ మై షోలో ప్రీ-సేల్స్ మరియు ఫస్ట్ డే కలిపి 2.5 లక్షల టికెట్లు దాటడం సినిమాకు ఉన్న క్రేజ్‌ను చూపిస్తోంది. హిందీ వెర్షన్ కూడా మొదటి రోజే సుమారు 1.25 కోట్లు వసూలు చేసింది. వీకెండ్‌లో కూడా ఇదే జోరు కొనసాగితే, డాకోయిట్ దీర్ఘకాలిక థియేట్రికల్ రన్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!