
గాసిప్స్

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. యారో సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
పెళ్లి నేపథ్యంలో సాగిన ఆసక్తికర కథతో, హాస్యం, భావోద్వేగాలు కలబోసిన కంప్లీట్ ఎంటర్టైనర్గా ‘ క్రేజీ కళ్యాణం’ రూపొందుతోంది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తయింది. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రాలకు సంగీతం అందించిన సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలో సినిమా సంబంధిత మరిన్ని విశేషాలను మేకర్స్ ప్రకటించనున్నారు.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!