

నటనపై ఆసక్తి తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీవిష్ణు, సహజ నటనతో క్రమంగా హీరోగా స్థిరపడ్డాడు. కంటెంట్‌కు ప్రాధాన్యత ఇస్తూ, విభిన్న కథలను ఎంచుకుని ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’. ఈ సినిమాలో యదునాథ్ మారుతీ రావు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు, శ్రీవిష్ణు జోడీగా నటిస్తున్న నయన్ సారిక. షూటింగ్ వేగంగా కొనసాగుతోందని, చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు మంచి స్పందన పొందాయి. అయితే, తాజాగా విడుదలైన ‘దేఖో విష్ణు విన్యాసం’ పాట వివాదానికి దారితీసింది. ఈ పాటలోని ఒక విజువల్ కారణంగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ను అవమానించారని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమస్య ఏమిటంటే, అల్లుఅర్జున్ తన బ్రాండ్‌గా AA (అల్లుఅర్జున్ & అల్లుఅర్మీ)ను ఉపయోగిస్తుంటారు. ఈ బ్రాండ్ తన సినిమాల్లో కూడా చూపించబడుతుంది. అయితే, ‘విష్ణు విన్యాసం’ సాంగ్‌లో శ్రీవిష్ణు AA బ్రాండ్‌ను తలకిందులుగా చూపించాడు. దీన్ని VV (విష్ణు విన్యాసం)గా మార్చారు. ఫలితంగా, కొంతమంది అభిమానులు దీన్ని అల్లుఅర్జున్ను అవమానించడమే అని భావించి సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే, కొందరు మాత్రం ఇది కేవలం సినిమా పేరును రాయడానికి చేయబడిన మార్పు మాత్రమే అని, దానిలో అవమానమేమీ లేదని సమర్ధిస్తున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!