

హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ స్పెక్టకల్ 'ది ఒడిస్సీ' భారత బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. తొలి వారాంతంలో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, వారంమధ్యలో కూడా అదే జోరును కొనసాగిస్తూ ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా నెట్ కలెక్షన్లు రూ.80.65 కోట్లకు చేరుకోగా, గ్రాస్ వసూళ్లు రూ.96.17 కోట్లుగా నమోదయ్యాయి.
ఇంగ్లీష్ వెర్షన్‌కు 52 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా, తెలుగు వెర్షన్‌కు 18 శాతం ఆక్యుపెన్సీ లభించింది. చెన్నై, కొచ్చి, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోనూ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. హోమర్ రచించిన గ్రీక్ పురాణ కావ్యం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో మ్యాట్ డేమన్ ప్రధాన పాత్ర పోషించగా, టామ్ హోలాండ్, ఆన్ హాత్వే, జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్, చార్లైజ్ థెరాన్ కీలక పాత్రల్లో నటించారు. అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌తో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!