

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, రాశి ఖన్నా మరియు శ్రీలీల హీరోయిన్స్‌గా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై టాలీవుడ్లో అంచనాలు భారీగా పెరిగాయి. సినిమా చుట్టూ క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో, విడుదల తేదీ పై పెద్ద చర్చ సాగుతోంది.
మేకర్స్ మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు. అయితే ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో మార్చ్ నెలలోనే రిలీజ్ అవుతుందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా మార్చి 19 లేదా మార్చి 26 అనే తేదీలు ఎక్కువగా ప్రచారం పొందుతున్నాయి.
కానీ ఈ రెండు తేదీల్లోనూ బాక్సాఫీస్ వద్ద పోటీ తప్పదని పరిశ్రమలోనే చర్చ. మార్చి19 కి రిలీజ్ అయితే ‘టాక్సిక్’ తో పోటీ పడాల్సి వస్తుంది.మార్చి 26 కి వస్తే ‘ది ప్యారడైజ్’తో పాటు ‘పెద్ది’ వంటి చిత్రాలు ఇప్పటికే లైన్లో ఉన్నాయి.
అందువల్ల, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఏ తేదీని ఖరారు చేసుకుంటుందో అధికారికంగా ప్రకటించే వరకు అభిమానులు మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంటుంది.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!