
గాసిప్స్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకరవర ప్రసాద్ గారు ఈ నెల 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఓవర్సీస్లో ఈ చిత్రం ప్రీమియర్లు 11 వ తేదీన జరగనున్నాయి. విడుదలకు ముందే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జోరందుకుని ఇప్పటికే 500 వేల డాలర్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.
ఈ ఘనతతో చిరంజీవి కెరీర్లోనే అతి వేగంగా హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకున్న చిత్రంగా మన శంకరవర ప్రసాద్ గారు నిలిచింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ప్రీమియర్లు మరియు తొలి రోజు కలిపి వసూళ్లు మిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశముంది. ట్రైలర్, పాటలకు వచ్చిన అద్భుత స్పందన, చిరంజీవి విన్టేజ్ స్టైలిష్ లుక్, అలాగే వెంకటేష్ స్పెషల్ క్యామియో సినిమా పై అంచనాలను మరింత పెంచుతున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!