

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకరవరప్రసాద్‌గారు’ ఘనవిజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అదే సమయంలో తన తదుపరి చిత్రాలపై కూడా వేగం పెంచారు. ఆయన చేతిలో ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల, కొల్లి బాబీ దర్శకత్వంలో సినిమాలు క్యూలో ఉన్నాయి. వీటితో పాటు వశిష్ఠ దర్శకత్వం వహించిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
గతేడాదే షూటింగ్ పూర్తిచేసుకున్న ‘విశ్వంభర’ వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా ఆలస్యమైంది. తాజాగా ఆ పనులు తుదిదశకు చేరుకోవడంతో విడుదలపై స్పష్టత వచ్చింది. తొలుత మే నెలలో విడుదలకు యోచించినా, తాజా సమాచారం ప్రకారం జులై తొలి వారంలో సినిమాను విడుదల చేయాలని యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేస్తోంది. ఈ విషయంపై చిరంజీవి స్పందిస్తూ, “ ఈ సినిమా జులై 9 న విడుదలయ్యే అవకాశం ఉంది. వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పూర్తిగా చూడలేదు ” అని తెలిపారు. ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటించారు.


_1771477764226.jpg&w=3840&q=75)









.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!