

మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ పుట్టినరోజు సందర్భంగా హృదయానికి హత్తుకునే సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రతి మగవాడి విజయానికి వెనుక ఓ స్త్రీ ఉంటుందని పేర్కొంటూ, తన జీవితంలో ఆ పాత్రను సురేఖ పోషించిందని ఆయన అన్నారు. 1980 ఫిబ్రవరి 20 న వివాహ బంధంతో ఒక్కటైన రోజు నుంచి సురేఖ తనకు అతి పెద్ద బలంగా నిలిచిందని చిరంజీవి గుర్తుచేశారు.
సురేఖను కుటుంబానికి కేంద్ర బిందువుగా, ప్రేమతో అందరినీ కలిపే శక్తిగా ఆయన అభివర్ణించారు. తన కుటుంబ సభ్యులను సొంత వారిలా అంగీకరించి, తల్లిదండ్రులకు నిజమైన కూతురిలా సేవలందించిన ఆమెను కృతజ్ఞతతో స్మరించారు. తన విజయ రహస్యం గురించి అడిగితే అది తన ప్రతిభ కాదని, సురేఖేనని గర్వంగా చెబుతానని ఆయన పేర్కొన్నారు. ఆమె నిశ్శబ్దంగా బాధ్యతలను నిర్వర్తించడంతోనే తాను కెరీర్‌పై దృష్టి పెట్టగలిగానని, ఈ రోజు తాను ఉన్న స్థాయికి చేరుకోవడానికి కారణం ఆమెనే అని చిరంజీవి భావోద్వేగంగా తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!