

మెగాస్టార్ చిరంజీవి , మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి సీజన్లో విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం చిరంజీవి బాక్సాఫీస్ స్థాయిని మరోసారి చాటడమే కాకుండా, దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. ఈ సందర్భంగా చిరంజీవి, అనిల్ రావిపూడికి అత్యంత విలాసవంతమైన రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును బహుమతిగా అందించారు.
చిరంజీవిని విన్టేజ్ స్టైల్లో హాస్యం, ఎనర్జీ, భావోద్వేగాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన అనిల్ రావిపూడి కథన శైలి అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిత్ర విజయం చిరంజీవిని ఎంతగానో భావోద్వేగానికి గురి చేయడంతో, తన కెరీర్లో దర్శకుడికి అందించిన అత్యంత ఖరీదైన బహుమతిగా ఈ కారును అందించారు. గతంలో అనిల్ రావిపూడికి పుట్టినరోజు సందర్భంగా ఖరీదైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చిన చిరంజీవి, ఈసారి రేంజ్ రోవర్‌తో వారి అనుబంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. మూడో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తున్న ఈ చిత్రం విజయోత్సవానికి ఈ సంఘటన మరింత ప్రత్యేకతను చేకూర్చింది.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!