
గాసిప్స్

సంక్రాంతి సీజన్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుతూ, మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ విజయం సాధించింది. విడుదలైన రెండో రోజుకే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.120 కోట్ల వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ ఘన విజయాన్ని పురస్కరించుకుని చిరంజీవి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఘనంగా వేడుక నిర్వహించారు.

ఈ వేడుకలో రామ్ చరణ్, వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సహా చిత్ర బృందం పాల్గొంది. కేక్ కటింగ్‌తో ప్రారంభమైన ఈ వేడుక, ఆత్మీయ విందుతో కొనసాగింది. చిత్ర విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ చిరంజీవి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు. భోగి, సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు ఈ విజయ వేడుక బృందంలోని ఐక్యతను మరింత చాటింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!