

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందిన 'అబ్జెక్షన్ మై లార్డ్' వెబ్ సిరీస్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వంలో డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ 7 ఎపిసోడ్ల కోర్ట్‌రూమ్ డ్రామా జూలై 31 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. కోర్టు ప్రాంగణంలో తన కుమార్తె సమీర కోసం నారాయణ ఆత్మాహుతికి పాల్పడటంతో ప్రారంభమయ్యే ఈ కథ భావోద్వేగం, ఉత్కంఠతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది.
ఏళ్లుగా న్యాయవాద వృత్తికి దూరంగా ఉన్న పరశురామ్ ఈ కేసును స్వీకరించడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. ప్రచారం, డబ్బు కోసమే కేసు తీసుకున్నాడని ప్రత్యర్థులు ఆరోపించగా, సొంత కుమారుడే ఆయనపై నమ్మకం కోల్పోవడం ఆసక్తిని పెంచుతుంది. సమీర కిడ్నాప్ వెనుక ఉన్న అసలు నిజం, పరశురామ్ గతం, చివరకు కేసును ఎలా ఛేదించాడు అనేది ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ సిరీస్‌లో అనన్య శర్మ, ముఖేష్ రుషి, స్నేహాల్, సమీర్ కీలక పాత్రలు పోషించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!