

స్వప్న సినిమాస్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కిన ‘ఛాంపియన్’ చిత్రం డిసెంబర్ 25 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుత స్పందనతో చిత్ర బృందం ‘పీపుల్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్’ ను నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో హీరో రోషన్ మాట్లాడుతూ, ఛాంపియన్ తమ అందరికీ ఎంతో స్పెషల్ మూవీ అని, ప్రేక్షకులు ఇచ్చిన విజయానికి ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని, కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా అని అన్నారు. నిర్మాత స్వప్న దత్ ఈ విజయం గొప్ప సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని పేర్కొన్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం, నటీనటుల అద్భుతమైన పెర్ఫార్మెన్సులు, భావోద్వేగ కథనం కలిసి ‘ఛాంపియన్’ ను ప్రేక్షకుల హృదయాలకు చేరువ చేశాయని టీమ్ పేర్కొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!