
.png&w=3840&q=75)
ఛాంపియన్ బాక్సాఫీస్ వద్ద బలమైన ఆరంభాన్ని నమోదు చేస్తూ క్రిస్మస్ విన్నర్‌గా నిలిచింది. విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.4.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అద్భుతమైన ఓపెనింగ్‌ను నమోదు చేసింది. గట్టిన ప్రచారం, గ్రాండ్ విజువల్స్, ఆకట్టుకునే కంటెంట్‌తో ఈ చిత్రం ప్రీ–రిలీజ్ హైప్‌ను విజయవంతంగా వసూళ్లుగా మార్చుకుంది.
రోషన్ మేకాకు ఇది రెండో సొలో హీరో మూవీ అయినప్పటికీ, ఈ స్థాయి ఓపెనింగ్ అతనికి గొప్ప ఆరంభంగా నిలిచింది. విడుదలైన 24 గంటల్లోనే బుక్‌మైషోలో 46 వేలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఓవర్సీస్లో కూడా మంచి స్పందన లభించగా, అమెరికాలో సుమారు 75 వేల డాలర్ల వసూళ్లు నమోదు చేసింది. బలమైన అడ్వాన్స్ బుకింగ్స్‌తో పాటు పాజిటివ్ టాక్ ఉండటంతో రానున్న రోజుల్లో మరింత వృద్ధి ఆశాజనకంగా కనిపిస్తోంది.
చార్ట్‌బస్టర్‌గా నిలిచిన “గిరా గిరా” పాట చిత్రానికి మంచి బజ్‌ను తీసుకొచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. కమర్షియల్ ప్యాకేజింగ్, ప్రొడక్షన్ విలువలు, ఎంగేజింగ్ సన్నివేశాలను ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. రోషన్ మేకా నటనకు ప్రత్యేకమైన ప్రశంసలు లభిస్తున్నాయి. ఇది ఆయన కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. లాంగ్ వీకెండ్, న్యూ ఇయర్ సెలవులు సమీపంలో ఉండటంతో ఛాంపియన్ బాక్సాఫీస్ వద్ద స్థిరమైన, విజయవంతమైన రన్‌కు సిద్ధంగా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!