
గాసిప్స్

విజయ్ నటించిన జన నాయగన్ సినిమాను సెన్సార్ సమస్యలు వెంటాడుతున్నాయి. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు, తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ కేసుపై ఈ నెల 9 న తీర్పు వెలువడే అవకాశం ఉందని సమాచారం.
సెన్సార్ సమస్యల కారణంగా ఈ నెల 9 న తమిళంలో సినిమా విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. అదే రోజు తెలుగు, హిందీ వెర్షన్లు విడుదలయ్యే అవకాశం కూడా లేదని తెలుస్తోంది. దీంతో ఈ నెల 9 న జన నాయగన్ తెలుగులో విడుదల కాకపోవడంతో, రాజాసాబ్ సినిమా సోలో రిలీజ్‌గా నిలిచే అవకాశాలు పెరిగాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!