

డిజిటల్ ప్రపంచంలో ప్రముఖుల పేరు, రూపం, గొంతును అనుమతి లేకుండా వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం వివాదాలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి కృతి సనన్ వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. విచారణ సందర్భంగా వ్యక్తిగత గుర్తింపునకు చట్టపరమైన రక్షణ ఎంతవరకు ఉండాలి, అంతర్జాతీయ ప్రమాణాలు ఏమిటనే అంశాలపై పరిశోధన పత్రాలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించినట్లు కథనాలు వెలువడ్డాయి. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అజిత్, అనిల్ కపూర్ వంటి ప్రముఖులు కూడా తమ గుర్తింపును అనధికారిక వినియోగం నుంచి కాపాడుకునేందుకు న్యాయపోరాటాలు చేశారు.
కృత్రిమ మేధస్సు ద్వారా గొంతులు, రూపాలను అనుకరించే ఘటనలు పెరుగుతుండటంతో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్, కంగనా రనౌత్, టబు, యువరాజ్ సింగ్, అభిషేక్ శర్మ, శశి థరూర్ వంటి ప్రముఖుల గుర్తింపు హక్కులపైనా చర్చ సాగుతోంది. అయితే వ్యక్తిగత హక్కులను పరిరక్షించడంతోపాటు జర్నలిజం, హాస్యం, మీమ్స్, కళాత్మక స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడటం న్యాయస్థానాలకు సవాలుగా మారింది. అక్టోబర్ 29న జరగనున్న తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!