
గాసిప్స్

బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు, సినీ హీరో చంద్రహాస్‌పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం, చంద్రహాస్ హీరోగా నటించిన బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఆ కార్యక్రమంలో చంద్రహాస్ వేదికపై అసభ్య పదజాలంతో కూడిన పాట పాడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ ఘటనపై బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్‌కుమార్ వీడియో విడుదల చేసి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన చంద్రహాస్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జర్నలిస్టును బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అశోక్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!