

కేవీఎన్ ప్రొడక్షన్స్, థెస్పియన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న “బాలన్ – ది బాయ్” చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. “మంజుమ్మెల్ బాయ్స్” బ్లాక్‌బస్టర్ దర్శకుడు చిదంబరం ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, “ఆవేశం” ఫేమ్ దర్శకుడు జితు మాధవన్ కథను అందించారు. వెంకట్ కె. నారాయణ, షైలజా దేశాయ్ ఫెన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల థియేట్రికల్ పంపిణీ హక్కులను ప్రముఖ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ, అన్నపూర్ణ స్టూడియోస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడిన “బాలన్ – ది బాయ్”కు అంతర్జాతీయ స్థాయిలో మంచి స్పందన లభించింది. స్థానిక భావోద్వేగాలను విశ్వవ్యాప్తమైన కథనంతో మేళవించి దర్శకుడు చిదంబరం ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం. ఈ చిత్రం తప్పక థియేటర్లలో చూడాల్సిన అనుభూతిని అందిస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!