
టెక్నాలజీ

Mem Famous ఫేమ్ సుమంత్ ప్రభాస్ నటిస్తున్న గ్రామీణ ప్రేమకథ గోదారి గట్టుపైన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. డెబ్యూ దర్శకుడు సుభాష్ చంద్ర దర్శకత్వంలో, రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే “ఫస్ట్ బ్రీజ్” ద్వారా మంచి బజ్ ఏర్పడింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ చూడూ చూడూని విడుదల చేయగా, మొదటి పాటతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
నాగ వంశీ అందించిన మధురమైన మెలోడీకి హరి చరణ్ హృద్యమైన గానం మరింత ప్రాణం పోసింది. దినేష్ కాకెర్ల రాసిన సాహిత్యం సుమంత్ ప్రభాస్ – నిధి ప్రదీప్ మధ్య ప్రేమను ఎంతో సహజంగా ఆవిష్కరిస్తుంది. గ్రామీణ నేపథ్యాన్ని ప్రతిబింబించే విజువల్స్, సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తం మీద ఈ పాట సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌కి మంచి ఆరంభం పలికింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!