
న్యూస్

రామ్ చరణ్ మరియు సుకుమార్ కలయికలో రూపొందబోతున్న ఆర్సీ 17 చిత్రంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ నెల 27 న రామ్ చరణ్ పుట్టినరోజు ఉండటంతో ఆ రోజు ఈ చిత్రంపై పెద్ద ప్రకటన వస్తుందేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ రోజున అధికారిక ప్రకటన ఉంటుందా అనే విషయంపై చిత్ర బృందం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు.
ఇటీవల సుకుమార్ సహాయక దర్శకుడు చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ చిత్ర కథపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సుకుమార్ రెండు విధాల కథలను సిద్ధం చేసి త్వరలో రామ్ చరణ్‌కు వినిపించనున్నారని సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ “పెద్ది” చిత్ర పనులతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ కథను ఖరారు చేసి ముందస్తు పనులు పూర్తి చేస్తే రామ్ చరణ్ ఆ చిత్రం పూర్తిచేసిన వెంటనే ఆర్సీ 17 చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!