
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే, మరో పెద్ద వార్త సినీ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. యాక్షన్ ఫిల్మ్స్‌లో తనదైన స్టైల్‌తో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇటీవల అల్లు అర్జున్ను కలిసినట్లు సమాచారం. అంతేగాక, ఆయన ఓ కథను కూడా వినిపించినట్లు రూమర్స్ చెబుతున్నాయి.
అయితే, ఈ వార్తలపై అధికారికంగా ఎవరు స్పందించలేదు. అయినప్పటికీ, అల్లు అర్జున్ మరియు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ వస్తుందనే మాటలు వినిపించడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేపుతోంది. విక్రమ్, లియో వంటి చిత్రాలతో రేంజ్ పెంచుకున్న లోకేష్ ఒక తెలుగు స్టార్ హీరోతో పని చేయడం ఇదే మొదటిసారి అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం బన్నీ పూర్తిగా అట్లీ సినిమా మీద ఫోకస్ పెట్టినా, లోకేష్ ప్రపోజల్ నిజమైతే భవిష్యత్తులో ఈ కాంబినేషన్ పక్కాగా హాట్ టాపిక్ అవుతుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!