
టెక్నాలజీ

‘అనుమాన పక్షి’ చిత్ర బృందం తాజాగా బ్రహ్మాజీని “బ్రహ్మోస్ – ది ట్రేసర్ బుల్లెట్” పాత్రలో పరిచయం చేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. లక్ష్యాన్ని ఎప్పుడూ తప్పని పాత్రగా ఈ క్యారెక్టర్‌ను చూపిస్తూ విడుదలైన పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదే సందర్భంగా ఈ నెల 11 న టీజర్ విడుదల కానుందని మేకర్స్ ప్రకటించడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
డీజే టిల్లు రచయిత-దర్శకుడి నుంచి వస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2026 లో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే క్యారెక్టర్ పోస్టర్లతో హైప్ క్రియేట్ చేస్తున్న ‘అనుమాన పక్షి’, టీజర్‌తో కథ, టోన్‌పై మరింత స్పష్టత ఇవ్వనుందని అభిమానులు ఆశిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!