
సినిమాలు

సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందిన రాఘవ లారెన్స్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం, ‘డీమోంటీ కాలనీ’ సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు అజయ్ జ్ఞానముత్తుతో ఆయన కలిసి పనిచేయనున్నారని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
హారర్ జానర్లో మంచి పేరు సంపాదించిన ఈ ఇద్దరూ ఇప్పటికే కథా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ‘కాంచన’ సిరీస్‌తో హారర్ సినిమాల్లో లారెన్స్ ప్రత్యేక ముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కాంబినేషన్లో సినిమా వస్తే అది మరో లెవెల్ హారర్ ఎంటర్టైనర్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!