
జనరల్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ప్రస్తుతం వర్కింగ్ టైటిల్‌గా రూపొందుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 11న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేక కానుకగా గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
తాజాగా ఈ గ్లింప్స్ విడుదల సమయాన్ని కూడా ప్రకటించారు. రేపు రాత్రి 11:52 గంటలకు గ్లింప్స్ విడుదల కానుంది. ఇది 4 నిమిషాల 35 సెకన్ల నిడివితో ఉండనుందని సమాచారం. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!