
అవతార్ 3 - (ఫైర్ అండ్ యాష్): భారీ అంచనాలతో విడుదలైనా ఓపెనింగ్ వసూళ్ల విషయంలో అభిమానులను నిరాశపరిచింది. జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2025 లో అతిపెద్ద ఓపెనింగ్ సాధిస్తుందని అంచనాలు ఉండగా, అవి తారుమారయ్యాయి.
అవతార్ 3 మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 137 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్ సాధించిన యానిమేషన్ చిత్రం ‘జూటోపియా 2’ (150 మిలియన్ డాలర్లు) రికార్డును అధిగమించలేకపోయింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలతో కలిపి కేవలం 36 మిలియన్ డాలర్లు మాత్రమే రావడం షాకింగ్‌గా మారింది.
2022 లో విడుదలైన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ మొదటి రోజు సాధించిన 441 మిలియన్ డాలర్లతో పోలిస్తే, ఈ మూడో భాగం సగం కూడా అందుకోలేకపోయింది. గత రెండు చిత్రాలు 2 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన నేపథ్యంలో, ‘ఫైర్ అండ్ యాష్’ అదే స్థాయికి చేరాలంటే వీక్‌డేస్‌లో బలమైన కలెక్షన్లు, క్రిస్మస్ సెలవుల్లో భారీ వసూళ్లు సాధించాల్సి ఉంది. ముందున్న రోజుల్లో అవతార్ 3 ఎలా పుంజుకుంటుందో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!