
సినిమాలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘AA22’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. తల్లి అయిన తర్వాత దీపికా రీఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అట్లీ, పనిగంటల వివాదాల నేపథ్యంలో దీపికాపై వస్తున్న వార్తలకు కౌంటర్ ఇచ్చారు. ‘‘దీపికా నాకు లక్కీ చార్మ్. మాతృత్వం తర్వాత ఆమెను ఈ సినిమాలో కొత్తగా చూస్తారు. ఆమె ఒక అద్భుతమైన నటి’’ అంటూ ప్రశంసలు కురిపించారు. అలాగే బన్నీ ఫ్యాన్స్‌కు అప్డేట్స్పై హామీ ఇస్తూ, ఎలాంటి సాకులు లేకుండా కష్టం, ప్యాషన్‌తో ఒక భారీ విజువల్ వండర్‌ను సిద్ధం చేస్తున్నామని అట్లీ తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!