
జనరల్

మలయాళ యాక్షన్ కామెడీ చిత్రం అతిరడి కేరళ బాక్సాఫీస్ వద్ద క్రమంగా పుంజుకుంటోంది. టోవినో థామస్, బాసిల్ జోసఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మూడో రోజు సుమారు ₹4.75 కోట్ల వసూళ్లు సాధించి మొత్తం కలెక్షన్లను ₹15 కోట్లకు చేరువ చేసింది. ప్రారంభంలో నెమ్మదిగా మొదలైన ఈ చిత్రం ఇప్పుడు పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
అరుణ్ అనిరుధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కాలేజ్ ఫెస్ట్, కిడ్నాప్‌లు, కామెడీ అంశాలతో సాగుతుంది. దృశ్యం 3 విడుదలకు ముందు మరో వారం పాటు పెద్ద పోటీ లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!