
గాసిప్స్

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో మరో సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ పేరుతో ఒక సినిమా రూపొందుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే అంశం పై మరో చిత్రం కూడా రానుందని తాజా చర్చలు మొదలయ్యాయి. ఈ సినిమాకు ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించనున్నారని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!