
సినిమాలు

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు సినీ ప్రయాణాన్ని గుర్తుచేస్తూ భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేసింది. మొదటిసారి మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చిన యువకుడు భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మహానటుడిగా ఎదిగిన విషయాన్ని ఆ పోస్ట్‌లో గుర్తు చేసింది.

ఏఎన్నార్ సినీ ప్రయాణంలో ఆ తొలి అడుగు ఎప్పటికీ ప్రత్యేకమని అన్నపూర్ణ స్టూడియోస్ పేర్కొంది. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు, నటుడిగా సాధించిన గౌరవం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉన్నాయి. #ANRLivesOn హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేసిన ఈ పోస్ట్ అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!