
సినిమాలు

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తనను ఆసుపత్రిలో చేర్చారన్న వదంతులను ఖండించారు. ముంబైలోని తన నివాసం జల్సా బయట తెల్ల కుర్తా ధరించి ఎప్పటిలాగే అభిమానులను పలకరిస్తూ కనిపించడం ద్వారా ఈ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టారు. ఆయన ఆరోగ్యంపై ఉన్న సందేహాలకు ఇది స్పష్టమైన సమాధానంగా నిలిచింది.
కల్కి 2898 ఏడి చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన అమితాబ్, త్వరలో మరిన్ని ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. “సెక్షన్ 84” అనే చిత్రంలో నిమ్రత్ కౌర్, డయానా పెంటీలతో కలిసి నటించనుండగా, ‘కల్కి 2898 ఏడి’ సీక్వెల్‌లో కూడా ఆయన భాగమవుతారని సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!