

ఎల్ఎ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హేమంత్ కుమార్, అయానా, గోపికా సురేష్ ప్రధాన పాత్రల్లో విజయ్ ఎన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆల్ఫా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచింది. యాక్షన్ సీక్వెన్స్‌లు, మాస్ డైలాగ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాంటిక్ ట్రాక్‌లతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమంలో హీరో హేమంత్ కుమార్ మాట్లాడుతూ, ప్రేక్షకులు పెట్టే డబ్బులకు తగిన వినోదాన్ని అందిస్తామని, నిజాయితీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. కన్నడలో మంచి స్పందన వస్తోందని, తెలుగులో కూడా ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధాన అతిథిగా హాజరైన దర్శకుడు సముద్ర ‘ఆల్ఫా’ ట్రైలర్‌ను ప్రశంసిస్తూ, హేమంత్ కుమార్‌కు తెలుగు పరిశ్రమలో పెద్ద విజయాలు రావాలని ఆకాంక్షించారు. హీరోయిన్ అయానా తాను పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించగా, గోపికా సురేష్ తన పాత్ర మహిళలకు ప్రత్యేకంగా నచ్చుతుందని చెప్పారు. ట్రైలర్, కంటెంట్‌పై నమ్మకంతో ఈ చిత్రాన్ని తెలుగులో భారీగా విడుదల చేస్తున్నట్లు డిస్ట్రిబ్యూటర్ రవిశంకర్ తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!