

అల్లు శిరీష్ తన వివాహ ఆహ్వానాలను కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా అందజేస్తున్నారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులు అల్లు అరవింద్, నిర్మలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఆయన భార్య అన్నా లెజ్నేవాను వారి నివాసంలో కలిసి పెళ్లికి ఆహ్వానించారు. అలాగే నాగబాబు, ఆయన భార్య పద్మజలను కూడా కలిసి శుభాకాంక్షలు కోరారు. ఈ సమావేశానికి సంబంధించిన చిత్రాలను శిరీష్ సామాజిక మాధ్యమాలలో పంచుకోగా అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
శిరీష్ తన ప్రియురాలు నయనికా రెడ్డితో మార్చి 6 న హైదరాబాద్లో సంప్రదాయ విధానంలో వివాహం చేసుకోనున్నారు. ఇదే తేదీ ఆయన అన్న అల్లు అర్జున్ వివాహ వార్షికోత్సవ దినం కావడం ప్రత్యేకతగా మారింది. నిశ్చితార్థం అనంతరం విదేశంలో విందు, హైదరాబాద్లో పసుపు కార్యక్రమం, కుటుంబ సమక్షంలో జరిగిన ఆనంద వేడుకలు వంటి వివాహానికి ముందున్న కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!