

దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ‘రాకా’తో అల్లు అర్జున్ మరోసారి వార్తల్లో నిలిచారు. అట్లీ దర్శకత్వంలో, దీపికా పదుకొణె కీలక పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే ఇండియన్ సినిమాల్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మారింది.
చిత్ర యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం, వరుస షూటింగ్‌లు, ప్రయాణాల కారణంగా అల్లు అర్జున్‌కు లగ్జరీ చార్టర్ ఫ్లైట్స్ ఏర్పాటు చేయాలని నిర్మాతలు పలుమార్లు సూచించినప్పటికీ, ఆయన ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. నిర్మాతల డబ్బు మొత్తం తెరపై కనిపించాలే గానీ వ్యక్తిగత సౌకర్యాల కోసం ఖర్చు చేయొద్దని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. వ్యక్తిగత ప్రయాణాల కోసం ప్రైవేట్ జెట్ ఉన్నప్పటికీ, సినిమా బడ్జెట్‌ను గౌరవిస్తూ సాధారణంగా టీమ్‌తో కలిసి ప్రయాణించడం ద్వారా అల్లు అర్జున్ తన ప్రొఫెషనలిజం, వినమ్రతను మరోసారి చాటుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!