
స్టార్ హీరో అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డి కి పెళ్లిరోజు సందర్భంగా ప్రత్యేకమైన బహుమతి ఇచ్చాడు. ఈ సందర్భంలో ఆయన ఖరీదైన బెంజ్ ఏఎమ్‌జీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదట ఈ కారును తన తమ్ముడు అల్లు శిరీష్ కు పెళ్లి కానుకగా ఇచ్చారని చాలామంది అనుకున్నారు. కానీ తరువాత విడుదలైన వీడియో ద్వారా ఇది భార్యకు ఇచ్చిన బహుమతి అని స్పష్టమైంది.
పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన అల్లు అర్జున్ 2011లో స్నేహా రెడ్డి ని వివాహం చేసుకున్నాడు. వీరికి అయాన్ మరియు అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిన్న వీరి పెళ్లిరోజు కావడంతో సోషల్ మీడియాలో తన భార్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే రోజు ఆయన సోదరుడు అల్లు శిరీష్ కూడా నయనికతో వివాహ బంధంలోకి అడుగుపెట్టడం విశేషం.
పెళ్లిరోజు సందర్భంగా అల్లు అర్జున్ భార్యకు బెంజ్ ఏఎమ్‌జీ మోడల్ కారును బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ కారు ధర మార్కెట్‌లో సుమారు రూ.4 నుండి రూ.5 కోట్ల మధ్యలో ఉంది. సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. అలాగే మరో చిత్రం దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!