
న్యూస్

డెకాయిట్ సక్సెస్ మీట్లో నిర్మాత అల్లు అరవింద్ నటి మృణాల్ ఠాకూర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మృణాల్.. నీ సినిమాలన్నీ చూశా. గతంలో సీత పాత్రలో ప్రేక్షకులను కట్టిపడేశావు. ఇప్పుడు డెకాయిట్‌లో విభిన్న పాత్రతో మళ్లీ ఆకట్టుకున్నావు” అని ఆమె నటనను ప్రశంసించారు.
ఇక సరదాగా మాట్లాడుతూ, గతంలో తాను లావణ్య త్రిపాఠిను ఆశీర్వదించగా, ఆమె వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకుందని గుర్తు చేశారు. అదే విధంగా మృణాల్ కూడా ఇక్కడి అబ్బాయినే పెళ్లి చేసుకుంటే తెలుగు ఇండస్ట్రీ వదలదని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలను అల్లు అరవింద్ గతంలోనూ చేయడం గమనార్హం కాగా, ఇప్పుడు ఇవి అభిమానుల్లో చర్చకు దారితీశాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!