

సంక్రాంతి సీజన్ సినిమా పరిశ్రమకు అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. 2027 సంక్రాంతిని లక్ష్యంగా చేసుకుని ‘అన్నపూర్ణ స్టూడియోస్’ తమ నిర్మాణ సంస్థ నుంచి ఓ భారీ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. హీరో, సినిమా వివరాలు వెల్లడించకపోయినా, జనవరి 15న విడుదల తేదీని లాక్ చేస్తూ ప్రమోషన్ ప్రారంభించారు. ‘వాసివాడి తస్సాదియ్యా.. సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్‌ఫుల్’ అంటూ ఇచ్చిన హింట్‌తో నాగార్జున–నాగచైతన్య కలయికలో మరో సినిమా రానుందా అనే చర్చ మొదలైంది.
‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘బంగార్రాజు’ తర్వాత దర్శకుడు కల్యాణ్ కృష్ణ మరోసారి నాగార్జునతో సినిమా చేయనున్నారనే వార్తలకు ఈ ప్రకటన బలం చేకూర్చింది. ఇదే సంక్రాంతికి చిరంజీవి–బాబీ, బాలకృష్ణ–గోపీచంద్ మలినేని, వెంకటేశ్–అనిల్ రావిపూడి సినిమాలు కూడా విడుదలయ్యే అవకాశాలుండటంతో 2027 సంక్రాంతి బాక్సాఫీస్ పోరు భారీగా ఉండనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!