

ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రేమ తెలుగు ప్రేక్షకులకు దేవి, ధర్మచక్రం వంటి చిత్రాలతో సుపరిచితమే. కన్నడ, తమిళ, మలయాళ భాషల్లోనూ ఆమె ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. అయితే గత కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అయినప్పటికీ ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి.
ప్రేమ 2006లో జీవన్ అప్పాచ్చును వివాహం చేసుకున్నారు. కొంతకాలం వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగినప్పటికీ, తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2016లో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. తాజాగా ప్రేమ రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో, ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించారు. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, జీవితంలో సరైన తోడు దొరకడం ముఖ్యమని చెప్పారు. తన మనసుకు నచ్చిన, జీవితాంతం అండగా నిలిచే మంచి మనసున్న వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనని తెలిపారు. జీవితంలో తోడు కావాలనిపిస్తే వయసుతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకోవచ్చని, 70 ఏళ్ల వయసులోనైనా పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదని ఆమె అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!