
గాసిప్స్

దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రంలో కథానాయికగా సాత్విక వీరవల్లి నటిస్తోందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఆమెను పరిచయం చేస్తూ ప్రత్యేక గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు.
గ్లింప్స్‌ను బట్టి చూస్తే, కనీస సౌకర్యాలు కూడా లేని ఒక పల్లెటూరిలో పుట్టిన అమ్మాయి తన కలలను ఎలా నిజం చేసుకుంది అనే భావోద్వేగ కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఆశలు, పట్టుదల, జీవిత ప్రయాణం చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుంది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!