

తెలుగు నటుడు ప్రిన్స్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. న్యూజిలాండ్‌లో నివసిస్తున్న ఎన్నారై సాయి మాచిరాజుతో ఆయన వివాహం నిశ్చయమైంది. గత నెలలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇటీవల ప్రిన్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక వీడియోను పంచుకుంటూ, “నేను కూడా ఒక ఇంటివాడిని కాబోతున్నాను” అంటూ ఈ శుభవార్తను అధికారికంగా వెల్లడించారు. ఆ వీడియోలో సాయికి ఆయన ప్రపోజ్ చేసిన క్షణాలు ఆకట్టుకోగా, హీరో ప్రియదర్శి కూడా ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ జంట ఆగస్టు 24న న్యూజిలాండ్‌లో ఘనంగా వివాహం చేసుకోనుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ స్నేహితుడి వివాహ వేడుకలో మొదటిసారి పరిచయమైన వీరిద్దరి స్నేహం తర్వాత ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఇప్పుడు పెళ్లి పీటల వరకు చేరుకుంది. ప్రస్తుతం హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విజయవంతంగా కొనసాగుతున్న ప్రిన్స్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!