

భార్యభర్తల మధ్య అనుబంధాన్ని పెంచే ఓ విశిష్ఠ ప్రక్రియతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది సమంత. రాజ్ నిడిమోరు ఎవరో మరీ విపులంగా చెప్పక్కర్లేదు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు డైరెక్టర్స్‌గా ఉన్న ఇద్దరిలో ఒకరే ఈ రాజ్ నిడిమోరు. పాపులర్ ఫిల్మ్ మేకర్.
పక్కా తెలుగుబ్బాయి. పుట్టిపెరిగిందంతా తిరుపతిలోనే. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి, సినిమాలపై ఇంట్రస్ట్‌తో అటువైపు ప్రయాణం సాగించారు. తనలాగే ఆలోచించే కృష్ణ దాసరి-డీకేతో కలిసి మొదట షార్ట్ ఫిల్మ్ తీశారు. అది సక్సెస్ అవడంతో ‘ఫ్లేవర్స్’ టైటిల్‌తో ఇంగ్లీష్ మూవీ తీశారు. ఆ తరువాత.. మరింత సక్సెస్ కోసం ఇండియాకొచ్చి ’99’ అనే హిందీ సినిమాను డైరెక్ట్ చేశారు. ‘ఇంకోసారి’ అనే తెలుగు సినిమాకు రైటర్స్‌గానూ పనిచేశారు. ‘షోర్ ఇన్ ద సిటీ’, ‘గో గోవా డాన్’ సినిమాలను తెరకెక్కించారు. ‘డీ ఫర్ దోస్తీ’, ‘ఫోర్సు’, ‘హ్యాపీ ఎండింగ్’ వంటి ప్రాజెక్టుల్లో భాగస్వామ్యమయ్యారు.
ఇక సమంత విషయానికి వస్తే… వైవాహిక జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించిన ఆమె, వ్యక్తిగత జీవితంతోపాటు కెరీర్ పరంగా కూడా మరింత బలంగా ముందుకు సాగడానికి ప్రయత్నిస్తోంది. ఆరోగ్య సమస్యలతో కొంత కాలం బ్రేక్ తీసుకున్నా, ఇప్పుడు మళ్లీ స్క్రిప్టులు వినిపిస్తూ, సెలెక్టివ్‌గా ప్రాజెక్టులు ఎంచుకుంటోంది. రాజ్ అండ్ డీకేతో చేసిన “ది ఫ్యామిలీ మ్యాన్ 2” ఆమె కెరీర్లో టర్నింగ్ పాయింట్ అనిపించుకున్న ప్రాజెక్ట్. అక్కడి నుంచి సమంత యాక్షన్ రేంజ్, స్క్రీన్ ప్రెజెన్స్ కొత్తగా గుర్తింపు పొందింది.
















కామెంట్స్ (2)
సమంత కెరీర్‌కి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ నిజంగా ఒక టర్నింగ్ పాయింట్ అయ్యింది.
Great to see Samantha balancing her personal life and career successfully!