

మనల్ని టార్చర్ పెట్టే పెళ్లాం తరఫు బంధువుల్ని, ముఖ్యంగా అత్తగార్ని–మామగార్ని ఆడుకుంటుంటే వచ్చే ఆ హై వేరే లెవల్ అంటూ చిరంజీవి నవ్వులు పూయించారు. ఆయన నయనతార తో జంటగా నటించిన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. ప్రత్యేక పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు. ఈ చిత్రం ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఆదివారం తిరుపతి లో ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ‘‘చిరంజీవిని నేను ఎలా చూపించాలనుకున్నానో, ఆయనలో నాకు నచ్చిన ప్రతి ఎలిమెంట్‌ను కథలో నింపాం. ట్రైలర్లో కనిపించిందంతా చిన్న గ్లింప్స్ మాత్రమే. సినిమా మొత్తం 2 గంటల 35 నిమిషాలు టైమ్ మిషన్‌లో ప్రయాణించిన ఫీలింగ్ ఇస్తుంది. నేను రాసిన దానికంటే మెగాస్టార్ దాన్ని ఇంకా గొప్పగా ప్రెజెంట్ చేశారు. కుటుంబంతో కలిసి థియేటర్లకు రండి, మెగాస్టార్‌ను సెలబ్రేట్ చేద్దాం’’ అన్నారు. నిర్మాత సుస్మిత కొణిదెల మాట్లాడుతూ, ‘‘ఈ సినిమా సంక్రాంతి ట్రీట్‌లా ఉంటుంది. పూర్తిగా మెగాస్టార్ మ్యాజిక్ కనిపిస్తుంది’’ అని చెప్పారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో, రా ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటూ చిరు పాత్రను ఎలివేట్ చేసే డైలాగ్స్‌తో ట్రైలర్ మొదలవుతుంది. కథను బయటపెట్టకుండా చిరంజీవి స్టైలింగ్, కామెడీ టైమింగ్, గ్రేస్‌ను కొత్తగా చూపించారు. శశిరేఖ పాత్రలో నయనతార చుట్టూ అల్లుకున్న కామెడీ ట్రాక్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. చివర్లో హెలికాప్టర్లో వెంకటేష్ ఎంట్రీ, చిరు–వెంకీ మధ్య సరదా సంభాషణలు ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో నిర్మాత సాహు గారపాటి, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.











కామెంట్స్ (1)
Full family entertainer..