

తెలుగు సినీ పరిశ్రమలో మన్మథుడు అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది నాగార్జున. 66 ఏళ్ల వయసులోనూ అదే స్టైల్, అదే చార్మ్‌తో యువ హీరోలకే పోటీ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు నాగ్. 2002 డిసెంబర్ 20 న విడుదలైన మన్మథుడు లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా సంచలన విజయాన్ని సాధించి, నేటితో (2025 డిసెంబర్ 20) 23 ఏళ్లు పూర్తి చేసుకుంది. త్రివిక్రమ్ స్టైల్లో చెప్పాలంటే… అమ్మ, ఆవకాయ ఎప్పుడూ బోర్ కొట్టనట్టే మన్మథుడు కూడా ఎన్నిసార్లు చూసినా కొత్తగానే అనిపిస్తుంది.
ఈ సినిమాకు కే. విజయభాస్కర్ దర్శకత్వం వహించగా, కథ–మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. సోనాలి బింద్రే, అన్షు హీరోయిన్లుగా నటించగా, అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్‌పై నాగార్జున స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సాధారణంగా మన్మథుడు అంటే అమ్మాయిల్ని ఆకర్షించే వ్యక్తిగా భావిస్తాం. కానీ ఈ వెండితెర మన్మథుడు మాత్రం అమ్మాయిల్ని ద్వేషిస్తాడు , అందుకే టైటిల్ కింద “హీ హేట్స్ ఉమెన్” అనే క్యాప్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేమ, హాస్యం, సెంటిమెంట్ సమపాళ్లలో మేళవించిన కథనం, త్రివిక్రమ్ రాసిన చిరస్థాయి డైలాగులు, బ్రహ్మానందంతో కలిసి ప్యారిస్ ఎపిసోడ్లలో వచ్చే హాస్యం, అలాగే దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆరు అద్భుతమైన పాటలు ఈ సినిమాను ఎవర్‌గ్రీన్‌గా నిలిపాయి. ఈ సందర్భంగా మన్మథుడు జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!