

మునగ మొక్క, వేర్లు, మునగ కాయలు, ఆకులు, పువ్వులు లోనూ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వైద్యులు, ఆయుర్వేద నిపుణులు చెబుతున్నట్టు, మునగను రెగ్యులర్‌గా తీసుకోవడం శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో, ఇమ్మ్యూనిటీ పెంచడంలో, మరియు అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. మునగ ఆకుల్లో విటమిన్ C, K, E, మెగ్నీషియం, మాంగనీస్, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండి, కేలరీలు తక్కువగా ఉండటంతో ఆరోగ్యానికి గొప్ప మేలుచేస్తాయి.
మునగకు వైద్య గుణాలు విస్తృతంగా ఉన్నాయి. టైఫాయిడ్ జ్వరంలో వేర్లను మరిగించి తాగడం, తలనొప్పి ఉంటే ఆకులను తలకు పట్టడం, గొంతు నొప్పి కోసం వేల్లతో కషాయం తయారు చేయడం, చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడం, ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం పొందడం లాంటి ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాక, మునగ కాలేయాన్ని, శరీరానికి అంతర్గత ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో సహాయపడుతుంది అని నిపుణులు పేర్కొన్నారు.
గమనిక: మేము అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎటువంటి బాధ్యత వహించము. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని, న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!