

ఈ రోజుల్లో గుండె సంబంధిత సమస్యలు చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా మాంసాహారం తినేవారిలో “చికెన్ తినాలా? మటన్ తినాలా?” అనే సందేహం చాలా మందికి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్యుల అభిప్రాయాన్ని తెలుసుకుందాం.
చికెన్:
చికెన్‌లో ప్రోటీన్ అధికంగా, కొవ్వు తక్కువగా ఉంటుంది. 100 గ్రాముల చికెన్‌లో సుమారు 30–32 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అందువల్ల జిమ్‌కు వెళ్ళేవారు, బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువగా చికెన్‌ను ఎంచుకుంటారు. అలాగే, బి విటమిన్లు ఎక్కువగా ఉండటం వల్ల మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే, ఫ్రైడ్ లేదా ప్రాసెస్ చేసిన చికెన్ ఐటమ్స్‌లో కొవ్వు, ఉప్పు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి అవి గుండె ఆరోగ్యానికి హానికరంగా ఉంటాయి.
మటన్:
మటన్‌లో ప్రోటీన్, ఐరన్, జింక్, B12 విటమిన్ వంటి ఖనిజాల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల మటన్‌లో సుమారు 25–27 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, ఇది రక్తహీనత ఉన్నవారికి కొంత ఉపయోగకరం. కానీ మటన్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అందుకే నిపుణులు మటన్‌ను తరచుగా లేదా అధికంగా తినకూడదని సూచిస్తున్నారు.
గుండె ఆరోగ్యానికి సరైన ఆహారం:
వైద్యుల ప్రకారం, గుండె సమస్యలున్న వారు చికెన్‌ను మితంగా తీసుకోవడం మంచిది. ఇంకా, చేపలు (ఫిష్) గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సూచన. మటన్‌కు దూరంగా ఉండటం గుండె సమస్యలను నివారించడంలో ఉత్తమం.
గమనిక:
ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించాలి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!