

మోకాలి నొప్పిని చాలా మంది ప్రారంభ దశలో పట్టించుకోరు, కానీ అది నిర్లక్ష్యం చేస్తే సమస్య క్రమంగా పెరిగి చివరికి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స అవసరం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. వైద్యులు సూచించే జాగ్రత్తలు తీసుకుంటే, కొన్ని అలవాట్లలో మార్పు చేసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు. మోకాల్లపై ఎక్కువ ఒత్తిడి ఏర్పడేలా బరువులు ఎత్తడం, ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం, నొప్పి ఉందని చెప్పి వ్యాయామం మానేయడం, డాక్టర్ సూచన లేకుండా కఠినమైన వ్యాయామాలు ప్రారంభించడం, హైహీల్స్ లేదా సరిగ్గా సరిపోని బూట్లు ధరించడం, ఆహార నియంత్రణ లేకపోవడం, ఫిజియోథెరపీ అవసరం ఉన్నా పట్టించుకోకపోవడం, డాక్టర్ సూచన లేకుండా నొప్పి మందులు వాడటం వంటి తప్పులు సమస్యను పెంచుతాయి.
మోకాలి నొప్పి పదే పదే రావడం, నడవడం కష్టం, మెట్లు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు నొప్పి పెరగడం, మోకాళ్లలో వాపు లేదా గట్టిదనం, ఉదయం లేవగానే మోకాళ్లు బిగుసుకోవడం, కొంత దూరం నడిచిన తర్వాత నొప్పి ఎక్కువవడం వంటి లక్షణాలను గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. జాగ్రత్తగా ఉండడానికి, మీ బరువును నియంత్రించండి, రోజూ తేలికపాటి వ్యాయామం మరియు స్ట్రెచింగ్ చేయండి, సరైన మద్దతు ఉన్న బూట్లు ధరించండి, మోకాళ్లపై అవసరానికి మించి ఒత్తిడి పెట్టకండి, నొప్పి అనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించండి, డాక్టర్ సూచన మేరకు ఫిజియోథెరపీ చేయించుకోండి. ప్రారంభ దశలో ఈ జాగ్రత్తలు పాటిస్తే, మోకాలి మార్పిడి అవసరం లేకుండా సమస్యను చాలా వరకు నియంత్రించవచ్చు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!