

సెప్సిస్ అనేది రక్తంలో ఇన్ఫెక్షన్ లేదా సంక్రమణ వల్ల వచ్చే తీవ్రమైన ఆరోగ్య సమస్య. హెల్త్‌లైన్ మరియు సీడీసీ ప్రకారం, ఇన్ఫెక్షన్ వల్ల రోగనిరోధక వ్యవస్థ అధికంగా స్పందించి రసాయనాలు విడుదల చేస్తుంది. ఈ ప్రతిచర్య నియంత్రణ తప్పినప్పుడు శరీరంలో అధిక వాపు, అవయవాల నష్టం జరుగుతుంది. ఇది ప్రాణాంతక స్థితికి దారితీసే ప్రమాదం ఉంది.
ఇప్పటి వేగవంతమైన జీవనశైలి, ఒత్తిడి, పనిభారం కారణంగా చాలా మంది డయాబెటిస్, ఫ్యాటీ లివర్, కిడ్నీ సమస్యలు, రక్తపోటు, గుండెపోటు వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. వీటిలో సెప్సిస్ కూడా ఒక ప్రధానమైన, కానీ చాలా మందికి తెలియని వ్యాధి. మాయో క్లినిక్ సహా పలు అధ్యయనాల ప్రకారం రక్తంలో ఇన్ఫెక్షన్ ఉంటే శరీరంలో జ్వరం, గందరగోళం, వేగంగా కొట్టుకునే గుండె, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే అవయవాలు దెబ్బతింటాయి. కాబట్టి సెప్సిస్ లక్షణాలను ముందుగానే గుర్తించి తగిన వైద్య చికిత్స తీసుకోవడం అత్యవసరం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!